Sai pallavi : గంగమ్మను దర్శించుకున్న సాయిపల్లవి.. చెల్లెలతో బీచ్‌లో ఎంజాయ్ చేసింది.. (video)
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్‌తో కలిసి రామాయణం సినిమాలో నటిస్తోంది సాయిపల్లవి. ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. ఈ నటి ఘాట్ వద్ద గంగా హారతిని కూడా చూసింది. ఇకపోతే.. సాయిపల్లవి ప్రస్తుతం తండేల్, రామాయణ మూవీల్లో నటిస్తున్నారు.
అయితే.. రామాయణం మూవీలో నటించడం వల్ల ఆమె నాన్ వెజ్ మానేశారని.. పూర్తిగా వెజిటెరియస్ అయిపోయారని రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై సాయి పల్లవి సీరియస్ అయ్యారు. అదే విధంగా ఇక మీదట ఇలాంటి లేనీ పోనీ ఆరోపణలు చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఈ క్రమంలో సాయి పల్లవి తాజాగా, ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ఉన్నారు. తాజాగా సాయిపల్లవి , తన చెల్లెలు పూజా ఖన్నన్‌తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ఉన్నారు. తాజాగా, సాయిపల్లవి ఆస్ట్రేలియా వెకెషన్ పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.