'ప్రతిరోజు పండగ' సెట్‌లో సాయితేజ్, రాశీఖన్నా సెల్ఫి
చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయితేజ్ హీరోగా.... భలేభలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్‌లో చేరిన గీతగోవందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా "ప్రతిరోజు పండగే చిత్రం పూజాకార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్‌కి వెళ్ళిన విషయం తెలిసిందే.
ఈ సినిమా నటీనటులు, టెక్నిషియన్స్‌ని ఎనౌన్స్ చేయగానే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని ప్రాజెక్ట్‌కి అంతే అన్నీ అలా కలసి వస్తాయ్. ఈ చిత్రంలో సాయితేజ్, రాశిఖన్నాలు జంటగా నటిస్తున్నారు. వీరిద్దరూ ఇంతకుముందు సుప్రీమ్ లాంటి ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్‌లో చేశారు. అలాగే ఈ బ్యానర్ పైన మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలేభలేమగాడివోయ్ లాంటి ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ వచ్చింది.
ఇప్పుడు వీరంతా ఓకే సెట్ పైన వుంటే ఎంటర్‌టైన్‌మెంట్ కాక ఇంకేమిటి ప్రతిరోజు పండగే అనే టైటిల్ జస్టిఫికేషన్‌లా షూటింగ్ జరుగుతుంది. సుప్రీమ్ హీరో సాయితేజ్, రాశీఖన్నాలు కలిసి వున్న సెల్ఫీ పిక్‌ని హీరోయిన్ రాశీఖన్నా ట్వీట్ చేయటం మెగా అభిమానులతో పాటు సోషల్ మీడియా ఫ్యాన్స్ కూడా పండగ చేసుకున్నారు.