శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (14:15 IST)

సల్మాన్ ఖాన్‌కు మరోమారు బెదిరింపులు

salman khan
బాలీవుడ్‌ అగ్ర హీరో సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి ఓ వ్యక్తి ఏకంగా ముంబై పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించాడు. సోమవారం రాత్రి 9 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి సల్మాన్‌ను 30వ తేదీలోపు చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. 
 
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్‌ ఎక్కడ నుంచి వచ్చింది..? ఎవరు చేశారు? అనే విషయాలపై ఆరా తీశారు. రాకీ భాయ్‌ పేరుతో దుండగుడు ఫోన్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు. సల్మాన్‌కు ఇలా బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. మార్చి 18వ తేదీ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయని.. సల్మాన్‌ టీమ్‌ తెలిపింది. 
 
ఈ విషయంపై  ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన టీమ్‌ వెల్లడించింది. ఈ బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ భద్రతపై మరింత దృష్టి పెట్టారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సల్మాన్‌ 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌'లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.