ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (11:03 IST)

హీరోయిన్ సమంత ఖాతాలో మరో అవార్డు

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఖాతాలో మరో అవార్డు చేరింది. తాజాగా ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. ఇటీవల "ది ఫ్యామిలీ మాన్-2" అనే వెబ్ సిరీస్‌లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. వెబ్ సిరీస్‌లో తొలిసారి నటించి మెప్పించారు. 
 
ఆ తర్వాత దర్శకద్వయం రాజ్ అండ్ డేకే రూపొందించిన ఇందులో రాజీ అనే పాత్రలో సమంత నటించారు. కెరీర్‌లో ఎపుడూ చేయని పాత్రలో ఆమె కనిపించి, ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకున్నారు. 
 
ఇపుడు ఈ పాత్రకు ఆమెకు అవార్డు లభించింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫేర్ నిర్వాహకులు స్వయంగా ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో సమంత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.