మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శుక్రవారం, 22 జనవరి 2021 (18:23 IST)

అతడి ఒడిలో కాళ్లు పెట్టి పడుకున్న సమంత, ఐ లవ్యూ అనేశాడు: డిలిట్ చేసేసింది

ఈమ‌ధ్య స‌మంత కాస్ట్యూమ్స్‌పై విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. తాను ఎక్క‌డికి వెళ్ళినా అక్క‌డ త‌న వ‌స్త్రాలంక‌ర‌ణ గురించే ఫొటోలు పోస్ట్ చేస్తుంది. దానికి సెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తుంటారు. ఆమ‌ధ్య త‌నపై అచ్చాద‌న‌లు క‌న్పిస్తూ పోస్ట్ చేస్తే.. సెటిజ‌న్లు.. అక్కినేని వార‌సుల కోడ‌ల‌కు ఏమైందంటూ తెగ స్పందించారు.
 
తాజాగా అలాంటిదే స‌మంత పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రాంలో డిజైన‌ర్ ప్రీతమ్ జుకాల్కర్‌తో పిచ్చాపాటీ మాట్ల‌డుతూ దిగిన‌ ఫొటో.. అది. అదెలా వుందంటే క‌బుర్లు చెబుతూ.. సమంత కాళ్ళ‌ను ప్రీత‌మ్ ఒళ్ళో పెట్టి ప‌డుకున్న ఫొటోని షేర్ చేసింది. దీనికి ప్రీతమ్ స్పంద‌న వైర‌ల్ అయ్యింది.
 
స‌మంత ఫొటోకు ప్రీతమ్ ఐల‌వ్యూ అని రిప్లై ఇవ్వ‌డంతో.. అస‌లు చ‌ర్చ మొద‌లైంది. అసలు ఏం నడుస్తుంది స‌మంత కుటుంబంలో అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌మంత- ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. ఇందుకోసం కొద్ది రోజుల క్రితం ముంబై వెళ్ళింది. అక్క‌డ ఫ్రెండ్స్‌తో క‌లిసి తెగ ర‌చ్చ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. ఫ్యాన్స్ విపరీతంగా స్పందిస్తుండటంతో ఆ పోస్టును సమంత డిలిట్ చేసేసింది.