ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (18:08 IST)

నాకు కుటుంబం, బాధ్యతలు వున్నాయి.. సమంత సంచలన కామెంట్స్ (video)

''96'' సినిమా కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించింది. విజయ్ సేతుపతి, అందాల తార త్రిష జంటగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫీల్ గుడ్ ప్రేమ కథను భారీ రేట్ చెల్లించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను ఆయన తెలుగులో 'జాను' పేరిట తెరకెక్కించారు.

శర్వానంద్-సమంత జోడిగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు గోవింద వసంత సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.  
 
ఈ సినిమా ద్వారా మరో బంపర్ హిట్ సమంత ఖాతాలో పడింది. పెళ్లికి తర్వాత కూడా సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ పోతున్న సమంత... జానుతో మంచి కలెక్షన్లు రాబడుతుందని సినీ పండితులు అంటున్నారు. జాను హిట్ నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్న నేపథ్యంలో.. సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా జాను ప్రమోషన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమంత సంచలన ప్రకటన చేసింది. 
 
ఇక రెండు మూడేళ్ల పాటే తాను సినిమాల్లో నటిస్తానని ప్రకటించింది. దీంతో మీడియానే షాక్ తింది. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వున్నాను. అయితే "నాకు కుటుంబం వుంది కదా.. బాధ్యతలు వుంటాయి. కదా.. అందుకే మహా అయితే మరో రెండు, మూడేళ్ల పాటు నటిస్తానేమో'' అంటూ కామెంట్లు చేసి అందరికీ షాకిచ్చింది. అందుకే చేయబోయే సినిమాలన్నీ ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలే చేస్తానని పేర్కొంది. దీంతో సమంత ఫ్యాన్స్ షాక్‌లోకి వెళ్ళిపోయారు.