గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : గురువారం, 30 మే 2019 (15:05 IST)

మరీ ఇంత సెక్సీగా ఉంటే సామ్? పెళ్లయ్యాక కూడా ఏంటీ పని..?

గోల్డెన్ లెగ్, గ్లామర్ డాల్‌గా దూసుకుపోతున్న అక్కినేని సమంత అందరిలా కాకుండా చాలా తెలివిగా, డిఫెరెంట్ స్టైల్‌లో ముందుకు వెళ్తోంది. నాగచైతన్యతో పెళ్లి అనగానే ఇక ఆమె కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. ఎందుకంటే గ్లామర్ ఒలకబోయడానికి ఒప్పుకోదు. సో సినిమా అవకాశాలు తగ్గుతాయి. 
 
ఒకవేళ అలాంటి సినిమా అవకాశాలు వచ్చినా చేయలేదు.. అనే రొటీన్ అభిప్రాయాలకు చెక్ పెడుతూ సమంత ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతనే ఆమె కెరీర్ పరుగులు పెడుతోందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
 
వెండితెరపై హీరోలతో రొమాన్స్ చేసేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. మరోవైపు షూటింగ్ విరామాలలో భర్త నాగచైతన్యతో కలిసి విదేశాల్లో షికార్లు కొడుతూ ఆ పిక్స్‌ను షేర్ చేస్తూ సంతోషంగా గడుపుతోంది సమంత. 
 
ఇటు అక్కినేని ఇంటి కోడలిగా, అటు నాగచైతన్యకు సరైన జోడీగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక పెళ్లయ్యాక మరీ హాట్‌గా మారిన సమంత భర్త నాగచైతన్యతో కలిసి హాట్ ఫోజులివ్వడంతో పాటుగాసోలో ఫోటోలతో కూడా పిచ్చెక్కిస్తోంది. ఈ ఫోటోలపై ఎన్ని విమర్శలొచ్చినా గ్లామర్ ఇండస్ట్రీలో ఇదంతా సహజమే అన్నట్లుగా హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం కంటిన్యూ చేస్తోంది సమంత.
 
తాజాగా ఆమె డెనిమ్ జీన్స్ షార్ట్, ప్రింటెడ్ కలర్స్ టాప్ ధరించి, షర్టుకు బటన్లు లేకుండా కింద ముడి వేసి ఉన్నట్లుగా మోడ్రన్ లుక్‌లో ఉన్న ఫోటోను పోస్ట్ చేయగా, నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలపెట్టారు. నీకు పెళ్లైందని మర్చిపోయావా?, గొప్పింటి కోడలివనే విషయం గుర్తుందా? అంటూ కామెంట్స్ చేయగా సమంత ఇవేమీ పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది.