గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (20:56 IST)

అశ్లీల యాడ్స్‌పై ట్వీట్... చెంప చెళ్లుమనే రిప్లై ఇచ్చిన ఐఆర్‌సీటీసీ

రైలు టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకునే సమయంలో ఐఆర్‌సీటీసీ యాప్‌లో వివిధ రకాల యాప్స్ వస్తుంటాయి. వీటితో యూజర్లకు చిర్రెత్తుకొస్తుంది. అలా ఓ యూజర్ ఈ యాప్‌ను ఓపెన్ చేయగా, అశ్లీల యాడ్స్ వచ్చాయి. అంతే.. వాటిని స్క్రీన్ షాట్ తీసి ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశాడు. దీనికి కొన్ని క్షణాల్లోనే ఐఆర్‌సీటీసీ ఆ యూజర్‌కు చెంప ఛెళ్లుమనేలా రిప్లై ఇచ్చింది. 
 
ఆనంద్ కుమార్ అనే యూజర్ రైలు టిక్కెట్ బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాడు. ఆ తర్వాత టిక్కెట్ బుక్ చేస్తుండగా, అశ్లీల యాడ్స్‌తో పాటు.. మరికొన్ని వాణిజ్య ప్రకటనలు వచ్చాయి. దీంతో ఆనంద్‌కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే వాటిని స్క్రీన్ షాట్ తీసి ఐఆర్‌సీటీసీకి ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. 
 
దీనిపై ఐఆర్‌సీటీసీ తక్షణం స్పందించింది. ఐఆర్‌సీటీసీ ఇచ్చిన సమాధానంతో ఆనంద్ దిమ్మతిరిగిపోయింది. "మీ బ్రౌజింగ్ హిస్టరీ మేరకు అలాంటి యాడ్స్ వస్తున్నాయి. అందువల్ల తక్షమం మీ హిస్టరీతో పాటు కుకీస్‌ను డిలీట్ చేయండి" అంటూ సలహా ఇచ్చింది.