భారత్‌కు అమెరికా షాక్ : కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి తొలగింపు
ఈ నెల 30వ తేదీ రాత్రి 7 గంటలకు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా షాకిచ్చింది. కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత్‌ను తొలగించింది. ఈ జాబితాలో కొనసాగేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలు లేవని సాకుచూపుతూ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూఎస్ ట్రేజరీ విభాగం అధికారికంగా ప్రకటన చేసింది.
అంతర్జాతీయ స్థాయిలో ఈ కమిటీని ఏర్పాటు చేసి, ఇందులో భారత్‌కు గత యేడాది మే నెలలో చోటుకల్పించింది. అయితే, ఈ జాబితా నుంచి భారత్‌తో పాటు స్విట్జర్లాండ్ దేశాలను తొలగించింది. ఈ మేరకు 40 పేజీలతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇటాలీ, ఐర్లాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం దేశాలు ఉన్నాయి.