ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (20:30 IST)

జెనీవాలో అన్నయ్య పెళ్లి.. హాజరైన సమంత.. ఫోటో వైరల్

Samantha
Samantha
విస్కాన్సిన్‌లోని లేక్ జెనీవాలోని సుందరమైన నేపధ్యంలో తన అన్నయ్య డేవిడ్ వివాహానికి నటి సమంత హాజరైంది. సోషల్ మీడియాలో అన్నయ్య పెళ్లి ఫోటోలను సమంత పోస్టు చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పర్పుల్ స్లీవ్‌లెస్ గౌను ధరించిన సమంత లైట్ మేకప్‌తో కనిపించింది.
 
సమంత 2010లో నాగ చైతన్యతో కలిసి గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రం ‘ఏ మాయ చేసావే’తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె బాణ కాతాడి, బృందావనం, దూకుడు, నీతానే ఎన్ పొన్‌వసంతం, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, రాజు గారి గది 2, బేబీ, యశోద, శాకుంతలం వంటి సినిమాల్లో నటించింది. 
 
సమంత చివరిగా తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం "‘కుషి"లో కనిపించింది. ఇక రాజ్ అండ్ డికె రూపొందించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' రెండవ సీజన్‌లో ఆమె రాజి పాత్రను పోషించింది. సమంత ప్రస్తుతం 'సిటాడెల్: హనీ బన్నీ'లో నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్, కే కే మీనన్, సిమ్రాన్ బగ్గా, ఎమ్మా కానింగ్ నటిస్తున్నారు. నవంబర్ 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.