శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (13:52 IST)

విజయ్- సమంత గురించి స్వాతిముత్యం తార ఏమని చెప్పింది?

vijay devarakonda
"స్వాతిముత్యం" సినిమా ద్వారా కేరక్టర్ ఆర్టిస్టుగా దివ్య శ్రీపాద మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో ఒక బిడ్డకు తల్లిగా ఆమె పోషించిన పాత్ర ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ నెల 11వ తేదీన రానున్న 'యశోద'  సినిమాలోను ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. 
 
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఒక యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ .. సమంత గురించి ప్రస్తావించింది. డియర్ కామ్రేడ్‌లో తాను నటించానని చెప్పింది. విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ ఉంది. అయినా సెట్లో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఆయన చాలా సింపుల్‌గా వుంటారు. 
 
ఇక ఇప్పుడు సమంతగారితో కలిసి 'యశోద' చేశాను. ఈ సినిమా కోసం తను చాలా రిస్క్ చేసిందనే చెప్పాలి. ప్రమాదకరమైన ఫైట్లు చేయడానికి కూడా తను వెనకాడలేదు. రియలిస్టిక్‌గా ఆమె చేసిన స్టంట్స్ ఈ సినిమాకి హైలైట్. ఇలాంటి స్టార్స్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెప్పాలి.