శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (15:36 IST)

‘పుడింగి నెంబర్‌ 1’గా సంపూర్ణేష్‌బాబు

KS Ramarao Clap
సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్నతాజా చిత్రానికి ‘పుడింగి నెంబర్‌ 1’ అని టైటిల్ నిర్ణ‌యించారు. ఈ సినిమాతో మీరావలి దర్శకుడిగా పరిచయం అవుతుండ‌గా విద్యుత్‌లేఖరామన్, సాఫీ కౌర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్  రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘనంగా జరిగింది. ముహూర్త‌పు స‌న్నివేశాని‌కి  ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు క్లాప్ కొట్ట‌గా, ప్ర‌ముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విఛాన్ చేశారు. ఈ రోజు నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ కొన‌సాగుతుంది.
 
దర్శకుడు మీరావలి మాట్లాడుతూ, కథ అద్భుతంగా వచ్చింది. ఏం టైటిల్‌ పెట్టాలా? అనుకున్నాం. ఫైనల్‌గా ‘పుడింగి నెం 1’  అనే టైటిల్ కన్‌ఫ‌ర్మ్ చేశాం. ‌ఈ కథకు హీరోగా ఎవరు సరిపోతారా? అని ఆలోచిస్తున్నప్పుడు నాకు రజనీకాంత్‌గారు గుర్తొచ్చారు. మన ఫస్ట్‌ సినిమాకే రజనీకాంత్‌ ఏంటి? అనుకున్నాను. మనకు ఎన్ని ఫీలింగ్స్‌ అయిన ఉండొచ్చు. ఎంత ఇమాజినేషన్‌ అయినాఉండొచ్చు. మనమెంటో మనం తెలుసుకోవాలి అది తెలుసుకున్నాను. సంపూర్ణేష్‌బాబు గుర్తు వచ్చారు. పుండింగి నెంబర్‌ 1గా నేను సంపూర్ణేష్‌బాబును ఫీలయ్యాను. డీఓపీ అనిల్‌ అన్న ద్వారా సంపూకి కథ చెప్పాను. సరే అన్నారు. సంపూ–బుజ్జమ్మ (విద్యత్‌లేఖరామ్మన్‌) కాంబినేషన్‌ అదిరిపోతుంది. మరొక హీరోయిన్‌గా సాఫీకౌర్‌ను అనుకున్నాం. సంపూ, సాఫీల కాంబినేషన్‌ అదిరిపోతుంది. పోసానిగారికి థ్యాంక్స్‌. మమ్మల్నీ ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత కేఏస్‌ రామారావుగారికి, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్‌’’ అన్నారు.
 
చిత్ర నిర్మాతలు  కె. శ్రీ‌నివాస రావు, కె. సుధీర్ కుమార్ మాట్లాడుతూ -`` పుడింగి టైటిల్‌లోనే ఫన్నీనెస్‌ ఉంది. కథ విన్నప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యాం. డైరెక్టర్‌ మంచి నటీనటులను ఎంచుకున్నారు. మా సినిమాలో నటించడానికి ఒప్పుకున్న పోసాని, అజయ్‌ఘోష్‌లకు ధన్యవాదాలు. నేటి నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. ఈ నెలలో 17 రోజుల షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. మిగిలిన షూటింగ్‌ మే నెలలో పూర్తి చేస్తాం. జూలైలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాము అన్నారు. 
 
Pudingi opening shot
హీరోయిన్‌ విద్యుత్‌లేఖ రామన్‌ మాట్లాడుతూ, నేను వెయిట్‌లాస్‌ అయినప్పుడు అనుకున్నాను మంచి లీడ్‌ రోల్‌ దొరకాలని. హీరోతో పాటు హీరోయిన్‌గా నేనుకూడా పోస్టర్‌లో ఉండాలనుకున్నాను. ఓ డైరెక్టర్‌ కాల్‌ చేసి నన్ను ఓ లీడ్‌ రోల్‌ చేయమన్నారు. అదో కలో నిజమో నాకు అర్థం కాలేదు. అదీ ఎలా నిజం అంటే..ఆ ఫోన్‌కాల్‌లో నాకు మేసేజ్‌ వచ్చింది. కరోనా సెఫ్టీ గురించి ఓ మేసేజ్‌ వచ్చింది. అప్పుడే నాకు ఇది నిజమే అనిపించింది. సంపూర్ణేష్‌బాబుతో సినిమాలో హీరోయిన్‌గా చేయనున్నారని తెలిసింది. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇండస్ట్రీ స్టార్టింగ్‌లో నేను చాలా స్ట్రగుల్‌ చేశాను. ఇప్పుడు సినిమాలో లీడ్‌ హీరోయిన్‌గా చేస్తున్నాను. నేను ఒక తమిళ అమ్మాయిని అయినప్పటికీని నన్ను అదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. చాలా పెద్ద పెద్ద సినిమాల్లో నటించాను నేను. ఇప్పుడు సంపూతో సినిమా చేయనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన మీరాగారికి ధన్యవాదాలు. ఆడియన్స్‌ అందరికి ఈ సినిమా నచ్చుతుంది.`` అన్నారు. 
 
సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ,  డైరెక్టర్ మీరాలో మంచి కసి ఉంది. నాలాంటి ఒక చిన్న నటుడిని ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత కేఎస్‌రామారావుగారికి, దర్శకులు భీమనేని శ్రీనివాస రావుగారికి ధన్యవాదాలు’’ అన్నారు.
 
హీరోయిన్‌ సాఫీకౌర్‌ మాట్లాడుతూ,`తెలుగులో నేను నటించనున్న తొలి తెలుగు సినిమా ఇది. సంపూర్ణేష్‌బాబుగారితో నేను సినిమా చేయనున్నానని తెలిసి నా ఫ్రెండ్స్‌ చాలామంది నాకు కాల్స్‌ చేశారు. వారందరికి హృదయాకాలేయం సినిమా చూశారు. సంపూగారి వీడియోస్‌ చాలా ట్రెండ్‌ అవు తుంటాయి. షూటింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
 
అజయ్‌ఘోస్‌ మాట్లాడుతూ, ఈ సినిమాలో నేను ఒక ముఖ్యమైన క్యారెక్టర్‌ చేస్తున్నాను. కొత్త డైరెక్టర్స్‌తో నేను తప్పక సినిమాలు చేస్తాను. సంపూగారితో నేను నటిస్తున్న తొలి చిత్రం ఇది. మంచి ప్రొడ్యూసర్స్‌ దొరకడం దర్శకుడు మీరావలి అదృష్టం’’ అన్నారు.
 
కత్తి మహేశ్‌ మాట్లాడుతూ, ‘‘సంపూ ఎంత గ్యారంటీ హీరో మనందరికి తెలుసు. అలాగే మంచి మార్కెటబుల్‌ హీరో కూడా. సంపూ–బుజ్జమ్మల కామెడీ కాంబినేషన్, ఓ కొత్త దర్శకుడు, మంచి నిర్మాతలు ఈ సినిమాకు కుదరడం సంతోషంగా ఉంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కుద్దీస్‌కు ఈ సినిమాతో మంచి బ్రేక్‌ రావాలి’’ అన్నారు
 
మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఖుద్దుస్‌ మాట్లాడుతూ, ‘‘మంచి టీమ్‌ కుదిరింది. ఆడియన్స్‌కు నచ్చే సినిమా చేస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమా ఆడియోఫంక్షన్‌లో కలుద్దాం. నా కన్నా నా మ్యూజిక్కే ఎక్కువగా మాట్లాడుతుంది’’ అని అన్నారు.
 
సాంకేతిక వ‌ర్గంః
బేన‌ర్‌: శ్రీ పుణ్య‌భూమి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి
క‌థ‌- ద‌ర్శ‌కత్వం: మీరావ‌ళి
నిర్మా‌త‌లు: కె. శ్రీ‌నివాస రావు, కె. సుధీర్ కుమార్ 
సంగీతం: ఎస్‌.ఎ. ఖుద్దుస్
ఎడిట‌ర్‌: అనీల్ కుమార్ వెగురు
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: నంద‌మూరి హ‌రి
లిరిక్స్‌: బాస్క‌ర‌భ‌‌ట్ల
ఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌
కో- డైరెక్ట‌ర్ : కె. శ్రీ‌నివాస‌రావు