శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (12:55 IST)

సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన కాంబినేషన్ లో సినిమా ప్రకటన

Sandeep Kishan and Trinadha Rao Nakkina
Sandeep Kishan and Trinadha Rao Nakkina
'ఊరు పేరు భైరవకోన'  హీరో సందీప్ కిషన్‌కి కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ఈరోజు తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. 'ధమాకా' వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన #SK30కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌ల తర్వాత, వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి ప్రొడక్షన్ హౌస్‌లు ఈ సినిమా కోసం మళ్లీ జతకట్టాయి.
 
త్రినాధ రావు నక్కిన, ప్రసన్న కుమార్ బెజవాడ కాంబినేషన్ విజయవంతమైనది, వారు కలిసి ధమాకాతో సహా అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ కొత్త చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ
 కథ, స్క్రీన్‌ప్లే  డైలాగ్‌లను అందిస్తునారు. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
విభిన్నమైన స్క్రిప్ట్‌లతో అలరించే సందీప్ కిషన్ #SK30 లో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు, ఇది గ్రాండ్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందించబడుతుంది. ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది.
 ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం  వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.