1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2024 (19:28 IST)

గ్రామీణ ప్రేమకథా చిత్రంగా ‘శశివదనే

Rakshit Atluri, Komali
Rakshit Atluri, Komali
రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. కోమలి కథానాయికగా నటిస్తోంది.  ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అంటూ  హృదయాన్ని హత్తుకునే గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పాటలు, టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మేకర్స్ ఈ సినిమా నుంచి ‘ఏమిటో ఏమిటో..’ అనే పాటను విడుదల చేశారు. 
 
హీరోయిన్‌పై మనసుపడ్డ హీరో తన మనసులో చేలరేగె భావాలను పాట రూపంలో వ్యక్తం చేసే క్రమంలో పాట వచ్చే సందర్భంగా అనిపిస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. పి.వి.ఎన్.ఎస్.రోహిత్ పాడిన ఈ పాటను కరుణాకర్ అడిగర్ల రాశారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. 
 
గౌరీ నాయుడు సమర్పణలో AG ఫిల్మ్ కంపెనీ, SVS స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల ఈ చిత్రాన్ని నిర్మించారు. రైటర్, డైరెక్టర్ సాయి మోహన్ ఉబ్బన సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు వచ్చిన మూవీ కంటెంట్‌తో.. ఈ ప్రేమకథా చిత్రంలో గోదావరి జిల్లాల అందాలను ఎలా చూపించబోతోన్నారు అనే దానిపై ఓ స్పష్టత వచ్చింది.