బాలీవుడ్‌లో విషాదం.. రీమేక్ స్పెషలిస్ట్ సతీష్ కౌశిక్ మృతి
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ సతీష్ కౌశిక్ మృతి చెందారు. బాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నటుడు అయిన సతీష్ కౌశిక్ గుండెపోటుతో గురువారం ప్రాణాలు కోల్పోయారని సతీష్ కౌశిక్ మరణవార్తను అతడి ప్రాణ స్నేహితుడు, నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మూడు దశాబ్ధాల సినీ ప్రయాణంలో నటుడిగా వందకు పైగా సినిమాలు చేశారు సతీష్. అలాగే దర్శకుడిగా 15 సినిమాలకు పైగా రూపొందించారు. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన రూప్ కి రాణి చోరోంకా రాజా సినిమాతో దర్శకుడిగా సతీష్ కౌశిక్ కెరీర్ ఆరంభమైంది. ఇటీవల ఓటీటీలో రిలీజైన ఛత్రివాలీ అతడు నటించిన చివరి సినిమా కావడం గమనార్హం.
అలాగే సతీష్ కౌశిక్ కామెడీ టైమింగ్‌కు మంచి పేరు రావడంతో నటుడిగానూ రాణించారు. మిస్టర్ ఇండియాలో క్యాలెండర్‌గా, దీవానా మస్తానాలో పప్పు పేజర్‌గా సతీష్ కౌశిక్ క్యారెక్టర్స్ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. కమెడియన్‌గా, విలన్ అసిస్టెంట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో వైవిధ్యమైన నటనతో మెప్పించారు.