సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 ఏప్రియల్ 2022 (09:55 IST)

నిజమైన తెలంగాణ పులిని చూడండి: రేవంత్ రెడ్డితో రాంగోపాల్ వర్మ

Revanth Reddy
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వార్తల్లో వుండకపోతే ఫీలవుతుంటారు. అందుకే ఏదో ఒక టాపిక్కుతో కొన్నిరోజులు అలా హాట్ టాపిక్‌గా మారుతుంటారు. తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి, ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేసి మరోసారి వార్తల్లోకి వచ్చారు.

 
రేవంత్ రెడ్డి భుజంపై చేయి వేసి దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసారు. ఫోటో పైన క్యాప్షన్ కూడా ఇచ్చాడు. రేవంత్ రెడ్డి నిజమైన తెలంగాణ పులి అంటూ ట్యాగ్ జోడించాడు. ఇక ఈ ఫోటోపైన నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేస్తున్నారు.

 
వర్మ ఏమయినా రేవంత్ రెడ్డి బయోపిక్ తీసేందుకు కంకణం కట్టుకున్నారేమో అని ఒకరు అంటే... ఏదో పనిలేక ఇలా కలిసి వుంటారని మరికొందరు అంటున్నారు. మొత్తమ్మీద వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చాడు.