శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (18:42 IST)

వాళ్ల త‌ల్లిదండ్రుల ప‌డ్డ క‌ష్ట‌మే సిటీమార్ స‌క్సెస్ః గోపీచంద్

seetimaarr successmeet
గోపీచంద్, త‌మ‌న్నాలు క‌బ‌డ్డీ కోచ్‌లుగా న‌టించిన సినిమా ‘సీటీమార్‌’. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవ‌లే విడుద‌లైన ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ సంద‌ర్భంగా యూనిట్ ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో చిత్ర యూనిట్ పాల్గొంది.
 
గోపీచంద్ మాట్లాడుతూ, వినాయ‌కుడి ఆశీస్సుల‌తో సినిమా పెద్ద స‌క్సెస్ సాధిస్తుంద‌ని చెప్పాను. అన్న‌ట్లుగానే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులను థియేట‌ర్‌కు తీసుకొస్తుంద‌నే గట్టి న‌మ్మ‌కంతో అన్నాను.  వినాయ‌క చ‌వితిరోజున సినిమాను విడుద‌ల చేశాం. వినాయ‌కుడు సీటీ కొట్టుకుంటూ వ‌చ్చి థియేట‌ర్స్‌కు ర‌మ్మ‌ని పిలిస్తే ప్రేక్ష‌కులు వ‌చ్చి మాకు చాలా పెద్ద విజ‌యాన్ని అందించారు. ఈ స‌క్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. పాండ‌మిక్ టైమ్‌లో షూటింగ్ చేయడ‌మంటే, మ‌న‌సులో తెలియ‌ని ఓ భ‌యం ఉంటుంది. అయినా కూడా ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డి చేశారు. 
 
ఈ సినిమాలో అమ్మాయిల క‌బ‌డ్డీ జ‌ట్టుగా న‌టించిన అమ్మాయిలు ఎన్నో బాధ‌ల‌ను అధిగ‌మించి ఈ స్టేజ్‌కు వ‌చ్చారు. ఈరోజు వాళ్లు స్క్రీన్‌పై క‌నిపించిన‌ప్పుడు క్లాప్స్ కొడుతున్నారంటే కార‌ణం, వాళ్ల త‌ల్లిదండ్రుల ప‌డ్డ క‌ష్ట‌మే. ఈరోజు వాళ్ల కుటుంబ స‌భ్యులు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఫైట్స్‌కు ఈరోజు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. అందుకు సంప‌త్ డిజైనింగ్ ఓ కార‌ణ‌మైతే, వెంక‌ట్‌, స్టంట్ శివ మాస్ట‌ర్స్ దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. ప్రేక్ష‌కులు నానుంచి ఎలాంటి ఫైట్స్ ఎక్స్‌పెక్ట్ చేశారో అలాంటి ఫైట్స్ అందించారు. 
 
ఇక మ‌ణిశ‌ర్మ‌గారి గురించి చెప్పాలంటే.. ప్రీ రిలీజ్‌లో చెప్పాను. ఆయ‌న‌తో ఏడు సినిమాల‌కు వ‌ర్క్ చేస్తే, ఆరు సూప‌ర్‌హిట్స్ ఉన్నాయని. ఇది మా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎనిమిదో సినిమా. ఇది కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అద్భుత‌మైన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ‌ణిగారికి థాంక్స్‌. ఆయ‌న‌తో వ‌ర్క్ చేస్తుంటే, మ్యూజిక్ పరంగా ఆయ‌న చూసుకుంటారులే అనే ధైర్యం ఉంటుంది. గౌత‌మ్ నంద త‌ర్వాత సౌంద‌ర్ రాజ‌న్‌తో క‌లిసి చేసిన సినిమా. ఆ సినిమా చూసి నాకు నేనే ఇంత అందంగా ఉన్నానా? అనిపించింది. ఈ సినిమాలో ఇంకా అందంగా న‌న్ను చూపించాడు సౌంద‌ర్‌. ద‌ర్శ‌కుడు సంప‌త్‌కు ఏం కావాలో సౌంద‌ర్ రాజ‌న్‌కు తెలుసు. సంప‌త్‌కు ఏం కావాలో దాని కంటే ఎక్కువ ఔట్‌పుట్టే ఇచ్చాడు. త‌మ‌న్నాతో వ‌ర్క్ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటే డేట్స్ అడ్జ‌స్ట్ కాక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో కుద‌ర‌లేదు. ఈ సినిమాలో కుదిరింది. త‌ను బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా న‌టించింది.
 
నేను జెన్యూన్‌గా హిట్ అనే మాట విని చాలా కాల‌మైంది. అంత‌కు ముందు హిట్స్ వ‌చ్చాయి. కానీ, ఈ మ‌ధ్య కాలంలో నా సినిమాల‌ను హిట్ అని విన్లేదు. కానీ సినిమా కొర‌త తీర్చేసింది. నేను హిట్స్‌, ప్లాప్స్ చూశాను. నా సినిమా హిట్టా, ప్లాపా అని నా ఫోన్ చెప్పేస్తుంది. ఇంకొక‌రు చెబితే నేను విన‌ను. హిట్ సౌండ్ ఎలా ఉంటుంది?  ప్లాప్ సౌండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నిర్మాత‌లు శ్రీనివాస్ చిట్టూరి, ప‌వ‌న్‌గారు ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. ప్రేక్ష‌కుల‌కు పేరు పేరునా చేతులెత్తి దండం పెడుతున్నాం. ఈ నిర్మాత‌లు ఇంకా మంచి సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూస‌ర్స్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 
 
చిత్ర ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది మాట్లాడుతూ, సాధార‌ణంగా నేను డైరెక్ట్ చేసిన ఏ సినిమా అయినా స‌రిగా ఆడ‌క‌పోతే, ఆ త‌ప్పు నాదేన‌ని చెబుతాను. అదే సినిమా పెద్ద హిట్ అయితే నా టీమ్‌కు ఆ స‌క్సెస్ క్రెడిట్ ద‌క్కుతుంద‌ని కూడా చెబుతుంటాను. ఫ‌స్టాఫ్‌లో రావు ర‌మేశ్‌గారు త‌న‌దైన డైలాగ్ డెలివ‌రీతో హీరోకు స‌పోర్ట్ చేస్తూ సినిమాను నిల‌బెడితే, సెకండాఫ్‌లో సినిమాకు హార్ట్‌గా నిలిచిన యాక్ట‌ర్ పోసాని కృష్ణ‌ముర‌ళిగారు స‌హా ఇత‌ర ఆర్టిస్టుల‌కు థాంక్స్‌. గౌత‌మ్ నంద స‌మ‌యంలో నేను, గోపీచంద్‌గారు ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా తీస్తున్నామ‌ని అనుకున్నాం. కానీ ఎందుకో ఆ సినిమా ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను రీచ్ కాలేక‌పోయింది. కానీ ‘సీటీమార్’ తో గోపీచంద్‌గారి బాకీ తీర్చేసుకున్నాను. సినిమా తొలి ఆట త‌ర్వాత సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ ఫోన్ చేసి సింహా అప్పుడు బాల‌కృష్ణ‌గారు, బోయ‌పాటిగారు ఎలాంటి హిట్ కొట్టారు. ఇప్పుడు గోపీచంద్‌గారు, మీరు అంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టార‌ని అన్నాడు. ఇక జ్వాలా రెడ్డి వంటి పాత్ర‌ను గుర్తుండిపోయేలా చేసిన త‌మ‌న్నాకు థాంక్స్‌. నిర్మాత‌లు శ్రీనివాస్ చిట్టూరి, ప‌వ‌న్‌గారి వ‌ల్లే ఈరోజు ఇలా స‌క్సెస్‌మీట్‌లో నిల‌బ‌డి మాట్లాడుతున్నాం. సాధారణంగా జై జవాన్, జై కిసాన్ అంటుంటారు. కానీ ఓ అమ్మ ప్రేమ తెలిసిన వ్య‌క్తిగా, బార్య ప్రేమ తెలిసిన వ్య‌క్తిగా, కూతురి ప్రేమ తెలిసిన వ్య‌క్తిగా చెబుతున్నాను. జై ఔర‌త్‌, జీయో ఔర‌త్ అని చెబుతున్నాను’’ అన్నారు.