బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (09:24 IST)

పవన్‌ను కలిసి షాయాజీ షిండే... మొక్క ప్రసాదంపై సమాచారం షేరింగ్

pawan - shayaji shinde
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు షాయాజీ షిండే మంగళవారం భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తన ప్రతిపాదనను పవన్‌కు వివరించారు. తన ఆలోచలను షిండే లిఖితపూర్వకంగా పవన్‌కు అందజేశారు. దీనపై పవన్ స్పందిస్తూ, షిండే సూచనలు తప్పకుండా పరిశీలిస్తానని తెలిపారు. 
 
కాగా, ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే ఓ ఆసక్తికర సూచన చేస్తానని చెప్పారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటచు ఒక మొక్కను కూడా భక్తులకు అందజేస్తే పచ్చదనం పెరుగుతుందన్న విషయాన్ని పవన్‌కు వివరిస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనకు పవన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య అరగంటకుపైగా సమావేశం జరిగింది. 
 
మరోవైపు, ఈ భేటీలో షాయాజీ షిండే మరాఠీ పద్యానికి పవన్ కళ్యాణ్ తెలుగు అనువాదం కింది విధంగా ఉంది. 
 
సూర్యుడు ఉదయిస్తే కేవలం రోజు మొదలవుతుంది.
కానీ చెట్టు నాటితే రోజు ఇంకా మంగళమయం అవుతుంది.
చెట్టు మంచి మంచి పళ్ళు ఇస్తుంది.
చెట్టు పూలు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది నీడ ఇస్తుంది. 
పక్షులకు ఆకు పచ్చటి అడవిని ఇస్తుంది.
నీడను ఇస్తుంది. 
శ్వాసకు ఆక్సిజన్ ఇస్తుంది.
మంచి ముచ్చట్లు ఇస్తుంది.
అమ్మలా మనల్ని లాలిస్తుంది.
చెట్టంటే... ఔషధం.
చెట్టంటే... దైవం.
ముందు తరాల ఆరోగ్యం కోసం.
పది చెట్లు నాటండి.
చెట్లుంటే మన అభివృద్ధి ఉంటుంది.
జీవితం ఆనందమయం అవుతుంది.