సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

గేమ్ ఛేంజర్‌గా రామ్ చరణ్ - అదిరిపోయిన టైటిల్ లోగో...

game changer
మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించే కొత్త చిత్రం టైటిల్‌ను ఆయన పుట్టినరోజు బహుమతిగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి "గేమ్ ఛేంజర్" అని టైటిల్‌ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం ఉదయం చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించింది.
 
'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రమిది. కియారా అడ్వానీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.