Daily Horoscope
✕

బాలయ్య అలాంటోడు: సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ హీరోయిన్..!

Written By శ్రీ
Updated: శుక్రవారం, 3 జులై 2020 (19:31 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి వర్మ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఇంతకీ.. వర్మ హీరోయిన్ ఎవరంటారా..? నేకెడ్ సినిమాలో నటించిన శ్రీరాపాక. రామ్ గోపాల్ వర్మ.... శ్రీరాపాకతో తెరకెక్కించిన నేకెడ్ మూవీ ఇటీవల రిలీజైంది. ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాలో నటించిన శ్రీ రాపాక ఎవరు..? ఎలా వర్మ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది..? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
 
ఇదిలా ఉంటే... ఈ అమ్మడు బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకీ విషయం ఏంటంటే... శ్రీరాపాక సినిమా ఇండస్ట్రీకి కొత్త కాదట. గతంలో చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసింది. స్వయంగా ఆమె ఈ విషయాలను చెప్పింది. బాలకృష్ణ గురించి చెబుతూ.... ఓసారి డిస్కషన్ కోసం బాలయ్య గారి ఇంటికి వెళ్లానని... అప్పుడు బాలయ్య గురించి తెలుసుకున్నాను అని చెప్పింది.
 
ఇంతకీ ఏం తెలుసుకున్నారంటే... ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం.. కాకపోతే కాస్త కోపం ఎక్కువ. ఏదీ మనసులో ఉంచుకోలేడు. ఏది అనుకుంటే అది చెప్పేస్తారు.. అది చేసేస్తారు.. మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తారు అని చెప్పింది. స్త్రీలకు ఎంతో గౌరవం ఇస్తారు. ఆ విషయం ఆయన్ని కలిసిన తర్వాత తెలుసుకున్నాను అని బాలయ్య గురించి తన మనసులో మాటలు బయట పెట్టింది శ్రీ రాపాక.

అన్నీ చూడండి

జగన్ ప్రాణాలకు ముప్పు.. అందుకే షర్మిలకు ప్యాలెస్ అనుమతి నిరాకరణ

మహిళపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు : ఏడీఆర్ నివేదిక

వరి సాగు చేయవద్దు.. కూరగాయలను పండించుకోండి.. రేవంత్ రెడ్డి

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. వేర్వేరు మండలాల్లో నామినేషన్ దాఖలు..

పేదరికం - వివక్ష వంటి ముళ్లబాటలో నడిచి పీజీ వైద్యురాలైన ట్రాన్స్‌జెండర్

అన్నీ చూడండి

ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'

కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ సీజన్‌లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి

అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్‎టెక్

అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

తర్వాతి కథనం
Show comments