ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఆర్. సందీప్
Last Modified: మంగళవారం, 9 జూన్ 2020 (22:03 IST)

జక్కన్న రూల్ బేఖాతరు, ఆర్ఆర్ఆర్ గురించి శ్రియ చెప్పేసింది

తాను తీసే సినిమాకు సంబంధించిన విశేషాలను రాజమౌళి గోప్యంగా ఉంచాలనుకుంటాడు. చిత్ర యూనిట్ బృందాలు కానీ టెక్నీషియన్‌లు కానీ, నటీనటులు కానీ ఏ ఒక్క విషయాన్ని కూడా బయట పెట్టడం జక్కన్నకు నచ్చదు. ముందుగానే వారికి పొక్కనివ్వవద్దని చెప్పి ఉంచుతాడు.
 
బాహుబలిని చిత్రించేటప్పుడు కూడా ఎలాంటి విషయాలను బయటకు రానివ్వలేదు. అలాంటిది శ్రియ 'ఆర్ఆర్ఆర్‌'కి సంబంధించి తన పాత్రను, కథాంశానికి సంబంధించిన క్లూని బయటపెట్టేసింది. సినిమా గురించి రామ్ చరణ్‌ను కాని ఎన్టీఆర్‌ను కాని అడిగినప్పుడు వారు కనీసం చిన్న హింట్ ఇచ్చేలా కూడా మాట్లాడలేదు. ఏ విషయం అయినా రాజమౌళిని అడగాల్సిందే, ఆయన నుండి ప్రకటన రావాల్సిందే అంటూ దాటవేసేవారు.
 
తాజాగా శ్రియ, అజయ్ దేవగన్ భార్య పాత్రలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపిస్తానంటూ ఒక సోషల్ మీడియా లైవ్ చాట్‌లో చెప్పింది. అభిమానులు ఊరుకుండక దీనిపై కథలు అల్లేస్తున్నారు. జక్కన్న దీనిపై ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.