గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మే 2020 (12:29 IST)

అన్నీ కుదిరితేనే 'ఆచార్య'లో చరణ్‌ నటిస్తాడు : కొరటాల శివ

సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం "ఆచార్య". మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది. నిజానికి ఈ చిత్రం దసరాకు విడుదల చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ కరోనా దెబ్బకు అన్నీ తారుమారయ్యాయి. 
 
అదేసమయంలో ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారనే వార్త ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొట్టింది. ఇవి పుకార్లు కాదు... నిజంగానే ఆచార్యలో ఓ కీలకమైన పాత్రలో నటింపజేసేందుకు దర్శకుడు కొరటాల శివ కథలో మార్పులు చేశారు. 
 
అయితే, ఊహించని విధంగా కరోనా దెబ్బకి అన్ని సినిమాల షెడ్యూల్స్.. నటీనటుల డేట్లు తారుమారై పోయాయి. దాంతో తన సినిమా ప్లానింగ్‌లో తేడా వస్తుండటంతో, ఎస్.ఎస్. రాజమౌళి మనసు మార్చుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి చరణ్ తప్పుకున్నాడనే టాక్ తాజాగా వినిపిస్తోంది.
 
ఈ పరిస్థితుల్లో కొరటాల శివ స్పందిస్తూ, 'కొన్ని ఇబ్బందులైతే వున్నాయి.. అన్నీ కుదిరితేనే చరణ్ ఈ సినిమాలో నటిస్తాడు' అని చెప్పారు. చరణ్ ఈ సినిమాలో లేకపోతే మెగా అభిమానులు ఒకింత నిరాశకి లోనవుతారనే చెప్పాలి.