మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (13:28 IST)

శృతిహాసన్‌కు కరోనా పాజిటివ్

హీరోయిన్ శృతిహాసన్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈమెకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు.
 
"అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని, త్వరలోనే మిమ్మలను కలుస్తాను'' అని పేర్కొంటూ ఓ సందేశాన్ని వెల్లడించారు. 
 
కాగా, కరోనా థర్డ్ వేవ్ సమయంలో అనేక మంది సినీ సెలెబ్రిటీలు కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. అలాంటివారిలో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఒకరు.