శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (18:18 IST)

సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన మూవీ తెలుసు కదా నుండి రొమాంటిక్ పోస్టర్

Siddu Jonnalagadda, Rashi Khanna
Siddu Jonnalagadda, Rashi Khanna
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు, ఈ సందర్భంగా ఆయన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తెలుసు కదా' నుండి ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సిద్ధు తన మోస్ట్ స్టైలిష్ అవతార్ లో అదరగొట్టారు.
 
బర్త్ డే స్పెషల్ పోస్టర్ లో, సిద్ధు, శ్రీనిధి శెట్టి మధ్య రొమాంటిక్ మూమెంట్, మరో సైడ్ రాశి ఖన్నా నుదిటిపై ముద్దు పెడుతూ కనిపించారు. పోస్టర్ ఇద్దరు అమ్మాయిలతో హీరో ప్రేమకథను ప్రజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై క్యురియాసిటీని క్రియేట్ చేసింది.
 
ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన డైరెక్టర్ గా పరిచయం అవుతున్న మూవీ 'తెలుసు కదా' పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రొఫెషనల్ నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్.
 
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష