ఆదివారం, 20 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఏప్రియల్ 2025 (16:47 IST)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

watermelon
watermelon
ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఉద్యోగాల విపణిలో ఒక వెల్లువలా వచ్చి ప్రతి పరిశ్రమనూ ఆక్రమిస్తోంది. కేవలంలో ఏఐ మాత్రమే కాకుండా దానికి అనుబంధ స్కిల్స్ గురించి సైతం నేర్చుకోవచ్చు. టెక్ రంగం ఎంత మారినా కానీ కొన్ని కనీస నైపుణ్యాలు ఎన్నడూ మారవు. మార్కెట్ అవసరాలను ఉద్యోగులు అర్థం చేసుకున్న రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా కెరీర్‌ను కొనసాగించే వీలుంటుంది. 
 
ఏఐ ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. పరిశ్రమలు ఇతరత్రా విభాగాలలో ఏఐలలో ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతోంది. నిత్యావసరాలకే ఏఐని ఉపయోగించే వారి సంఖ్య ఇంకా పెరుగుతోంది. 
 
తాజాగా పుచ్చకాయ కొనేందుకు చాట్‌జీపీటీని వాడాడు. వేసవి కాలం కావడంతో ఓ వ్యక్తి పుచ్చకాయ కొనేందుకు చాట్‌జీపీటీ సాయంతో అతడు వివిధ రకాల పుచ్చకాయలను పరిశీలించాడు. 
 
అందులో స్వీట్ అండ్ రెడ్‌గా వున్న పండును గుర్తించాలని ఏఐని కోరాడు. కొన్నింటిని పరిశీలించాక ఒక దానిని అది సూచించింది. కట్ చేసి చూడగా పండు ఎర్రగా వుంది.  దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.