Daily Horoscope
✕

మరోమారు పెళ్లి కూతురు కానున్న గాయని సునీత!

Written By ఠాగూర్
Updated: సోమవారం, 7 డిశెంబరు 2020 (13:23 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయని సునీత మరోమారు పెళ్లి పీటలెక్కనుంది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోనుంది. 
 
గాయని సునీతకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా సునీత తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అలా చాలా సంవత్సరాలుగా భర్తకు దూరంగా జీవిస్తోంది. ఆ తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకుంది.
 
ఈ క్రమంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, వీటిపై ఆమె ఎక్కడా స్పందించలేదు. పైగా, ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఆమె ఉన్నట్టుండి మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.
 
ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సోమవారం ఉదయం ఆమె నిశ్చితార్థం జరిగింది. ఇంట్లోనే చాలా నిరాడంబరంగా నిశ్చితార్థ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా సునీత సిగ్గుపడుతూ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

అన్నీ చూడండి

జనసేనలో చేరిన గీత రచయిత అనంత శ్రీరామ్ కుటుంబం, సర్పంచ్‌గా పోటీ చేస్తున్న శ్రీరామ్ మాతృమూర్తి

మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే మృతి

డొనాల్డ్ ట్రంప్‌తో చైనాలో కిమ్ భేటీ.. నావికా వర్శిటీని సందర్శించిన కిమ్

ప్యాసింజర్ ట్యాక్సీలుగా నడిపేందుకు రాష్ట్రాలు అనుమతి ఇవ్వాలి : నితిన్ గడ్కరీ

Raptadu Girl Recovery: రాప్తాడు ఘటనపై నారా లోకేష్ జోక్యం.. యువ మంత్రులకు ఆదర్శం

అన్నీ చూడండి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?

ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?

తర్వాతి కథనం
Show comments