మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: సోమవారం, 19 అక్టోబరు 2020 (14:18 IST)

సీఎం కేసీఆర్ దత్త పుత్రికకు ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్థం

పిన తల్లి, కన్న తండ్రి చేతుల్లో మూడేళ్ల క్రితం చిత్ర హింసలకు గురైన ప్రత్యూష అనే అమ్మాయిని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆ అధికారి పర్యవేక్షణలో మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రత్యూష యోగక్షేమాలను చూస్తోంది.
 
కేసీఆర్ దత్త పుత్రికకు ఆమె ప్రేమించిన వ్యక్తితో తాజాగా నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్ విద్యానగరంలో ఓ హోటల్‌లో ఈ వేడుక జరిగింది. హైదరాబాదు రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో నిరాడంబరంగా జరిగిన ప్రత్యూష నిశ్చితార్థం వేడుకను సీఎం కేసీఆర్ ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య పర్యవేక్షించారు.
 
కాగా కేసీఆర్ దత్తత తీసుకున్న అనంతరం ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి కుదుట పడింది. అంతేగాక ఆమె నర్శింగ్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తోంది.