మంగళవారం, 3 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (16:40 IST)

సోషియో ఫాంటసి యమ డ్రామ టైటిల్ ఆవిష్కరించిన విజయశాంతి

Yama drama  title unveiled by Vijayashanthi
Yama drama title unveiled by Vijayashanthi
యముడి పాత్రను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చేసుకుని సోషియో ఫాంటసి కధాంశంతో వచ్చిన చిత్రాలన్నీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆ కోవలో అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా  "యమ డ్రామ" చిత్రాన్నిమలిచిన యూనిట్ కు అభినందనలు తెలియజేస్తున్నానని అని ప్రముఖ నటి, లేడీ అమితాబ్ విజయశాంతి అన్నారు.
 
ఫిల్మీ మెజీషియన్స్ పతాకంపై యువచంద్ర, శివకుమార్, కౌటిల్య, సుదర్శన్ రెడ్డి హీరోలుగా, ప్రియాంక శర్మ (సవారి ఫేమ్), నేహాదేశ్ పాండే, హమీద హీరోయిన్లుగా నటించారు. టి.హర్షచౌదరి దర్శకత్వంలో తోటకూర శివరామకృష్ణారావు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది. కాగా ఈ సినిమా టైటిల్ లోగోను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి విజయశాంతి ఆవిష్కరించారు. 
 
అనంతరం విజయశాంతి మాట్లాడుతూ, నేటి ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని, యూత్ ఫుల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా దర్శక, నిర్మాతలు చెప్పారు. ప్రేక్షకుల పల్స్ తెలుసుకుని మరీ వారు ఈ సినిమాను చేసినట్లు అర్ధమైంది. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరింపజేయాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.
 
చిత్ర దర్శకుడు టి.హర్షచౌదరి మాట్లాడుతూ, "మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్  తో పాటు మిగిలిన అన్ని అంశాలు ఇందులో ఉండటంతో పాటు యూత్ కు ఓ మంచి సందేశం కూడా ఇందులో ఉంది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, లవర్స్ వంటి అన్ని వర్గాల వారు మెచ్చేలా దీనిని మలిచాం. సీనియర్ నటుడు సాయికుమార్ యముడి పాత్రలో నటించడం ఓ హైలైట్ అని" చెప్పారు.
 
నిర్మాత టి.శివరామకృష్ణారావు మాట్లాడుతూ, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  వెల్లడించగా, ఈ సినిమాలో హీరోలలో ఒకరిగా నటించడం ఆనందంగా ఉందని కౌటిల్య తెలిపారు.
 
ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రలలో సాయికుమార్, పోసాని కృష్ణమురళి, శివన్నారాయణ, వేణు వండర్స్, జెన్ని, గౌతంరాజు తదితరులు తారాగణం. సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల, సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటింగ్: ఉద్దవ్. సమర్పణ: సుకన్య, నిర్మాత: టి.శివరామకృష్ణారావు, దర్శకత్వం: టి.హర్షచౌదరి.