ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (16:07 IST)

కుమార్తెతో తారకరత్న ఆటలు - లాస్ట్ వీడియో వైరల్

tarakaratna
ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన నందమూరి తారకరత్న బెంగుళూరు ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆయన తన కుమార్తెతో చివరి క్షణాల్లో గడిపిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తారకరత్న మరణించిన నెల రోజుల పూర్తయిన తర్వాత భర్త ప్రేమను గుర్తు చేసుకుంటా ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఈ వీడియోను షేర్ చేశారు. 
 
వివాహం తర్వాత దగ్గరివాళ్లే దూరం పెట్టి నరకం చూపించారని, జీవితం అంతా కష్టాలే అనుభవించారంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాజాగా నిష్క, తండ్రితో కలిసి ఆడుకున్న చివరి వీడియోను షేర్ చేశారు. హిందూపూర్ వెళ్లడానికి ముందు కూతురితో కలిసి తారకరత్న ఓ గేమ్ ఆడారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ లవ్ యూ తారక్ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. 
 
కాగా, జనవరి 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. ఇందులో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా కుప్పంకు వెళ్లగా అక్కడ గుండెపోటు రావడంతో ఆయనకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసి, ఆ తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్క 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన ఫిబ్రవరి 18వ తేదీన తుదిశ్వాస విడిచారు.