గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (20:54 IST)

సోనూసూద్ మరో సంచలన నిర్ణయం- జెట్ స్పీడ్‌లో ఆక్సిజన్ ప్లాంట్స్..

కరోనా కష్టకాలంలో గత ఏడాది నుంచి కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ నిర్విరామ సేవలు మొత్తం ప్రపంచమంతా జేజేలు పలుకుతున్నారు. చివరకు మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సైతం చేయలేని పనులు, సహాయలు చేస్తున్న సంగతి తెలిసిందే. డబ్బును ఏ మాత్రం లెక్క చేయకుండా తన సొంత ఖర్చులతో ఆపదలో ఉన్న వారి కష్టాలు తొలగించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. 
 
ఇక సెకండ్ వేవ్ ‌లో సోనూసూద్ సహాయల సంఖ్య మరింత ఎక్కువగా మారింది. సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళతాను అని మాట ఇచ్చేశాడు. అన్నట్లుగానే ఆక్సిజన్ ప్లాంట్స్‌ను జెట్ స్పీడ్‌లో నిర్మించి ఎంతో మందికి ఊపిరి పోస్తున్నాడు. 
 
ఇక ఇప్పుడు మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ కోసం దేశమంతా ఆర్తనాధాలు వినిపిస్తుండడంతో ఎవరు ఎంత దూరం నుంచి అడిగినా కూడా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి అవసరం ఉన్నా కూడా www.umeedbysonusood.com కు లాగిన్ అవ్వాలని  కోరారు. ఆక్సిజన్ సిలిండర్స్ డిటిడిసి ద్వారా అవసరమైన వారికి పంపబడుతుందని తెలియజేశారు.