ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 24 జులై 2023 (15:35 IST)

ఫతే లో యాక్షన్ సీన్స్ కోసం సిక్స్ ప్యాక్ తో సోనూసూద్

Sonusood with six pack
Sonusood with six pack
అరుంధతి లో బొమ్మాలి నిన్ను నే వదల.. అంటూ అనుష్క ను బయపెట్టించే సోనూసూద్ ఇప్పడు సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. హిందీ సినిమా ఫతే ను సోనూసూద్ చేసున్న విషయం తెలిసిందే. తాజా యాక్షన్ సీన్స్ తెస్తున్నారు. చిత్ర యూనిట్ సోనూసూద్ సిక్స పాక్ లుక్ ను నేడు విడుదల చేసింది. చొక్కా లేని ఈ ఫోటో వైరల్ అవుతుంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. సోమవారంనాడు కొన్ని యాక్షన్ సీన్స్ తీశారు. 
 
 యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఫతే. . వైభవ్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఢిల్లీ,  పంజాబ్‌లోని వివిధ ప్రదేశాలలో చిత్రీకరించరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫ్ చేయడానికి లాస్ ఏంజిల్స్ నుండి ప్రత్యేక అంతర్జాతీయ సిబ్బందిని రప్పించారు. ఇంతకు ముందెన్నడూ చూడని హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తాను అని సోనూసూద్ తెలిపారు. 49 ఏళ్ళ వయసులో ఫిట్గా ఉండటం విశేషం. తెలుగులో  ‘యువ’, ‘అతడు’, హిందీలో ఆషిక్ బనాయా ఆప్నే’, ‘జోధా అక్బర్’, ‘కందిరీగ’ వంటి అనేక హిట్‌లను సోనూ చేశారు.