సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 జూన్ 2017 (11:21 IST)

స్పైడర్ టీజర్ రిలీజ్.. మహేష్ తన ల్యాప్ టాప్‌‍పై పనిచేస్తుంటే.. ''ష్'' అన్నాడు ఎందుకో? (Video)

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్ గురువారం రిలీజైంది. ఈ సినిమా టీజర్‌ను బుధవారమే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్ గురువారం రిలీజైంది. ఈ సినిమా టీజర్‌ను బుధవారమే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు బాధలో ఉండటంతో టీజర్ రిలీజ్ను చిత్రయూనిట్ వాయిదా వేశారు.
 
ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సెట్స్ మీద ఉన్న తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టీజర్ను రిలీజ్ చేస్తుంటారు. అయితే దాసరి మరణంతో కృష్ణ తన పుట్టిన రోజు వేడుకలు జరగలేదు. అదే సమయంలో మహేష్ కూడా స్పైడర్ టీజర్ను కూడా బుధవారం కాకుండా గురువారం రిలీజ్ చేశారు.
 
కాగా.. టాగూర్ మధు సమర్పణలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నిర్మితమవుతున్న 'స్పైడర్' టీజర్ విడుదలైన కొద్ది సేపటికే నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి గ్రాఫిక్స్, సీజీ ప్రధానంగా చిత్రం ఉన్నట్టు టీజర్‌ను చూస్తేనే తెలిసిపోతుంది. ఓ బాక్స్ రోబో స్పైడర్‌గా రూపాంతరం చెంది నెమ్మదిగా పాకుతూ, మహేష్ బాబు కాలుపైకి ఎక్కడంతో టీజర్ ప్రారంభమవుతుంది.
 
మహేష్ తన ల్యాప్ టాప్‌‍పై పని చేస్తుండగా.. భుజంపైకి వెళ్ళి ఏదో చెప్పబోతే.. అందుకు మహేష్ బాబు డిస్ట్రబ్ చేయవద్దు అన్నట్లు ''ష్" అని చూపుడు వేలు చూపుతాడు. దీంతో టీజర్ ఓవర్ అవుతుంది. ఈ టీజర్ సూపర్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.