మంగళవారం, 8 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఏప్రియల్ 2025 (20:44 IST)

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

Sumaya Reddy
Sumaya Reddy
వైసీపీ రాప్తాడు ఇంఛార్జి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హీరోయిన్ సుమయాల మధ్య సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలపై సుమయాల ఫైర్ అయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో హీరోయిన్ సుమయరెడ్డి భుజంపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేయి వేసి ఉన్న వీడియో నెట్టింట వైరలయ్యింది. 
 
ఈ వైరల్ వీడియోపై అటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇటు సుమయరెడ్డి క్లారిటీ ఇచ్చారు. సుమయ రెడ్డి తమ బంధువుల అమ్మాయిగా చెప్పిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. తప్పుడు ఆరోపణలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ఎయిర్‌పోర్టులో తమ బంధువుల అమ్మాయితో మాట్లాడుతుండగా వీడియో తీశారని ఫైర్ అయ్యారు. ఎయిర్‌పోర్టు వీడియోను పోస్టు చేసిన వారిపైనా, వైరల్ చేస్తున్న వారిపైనా పోలీస్ కేసు పెట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. 
 
ఈ వ్యవహారంపై హీరోయిన్ సుమయా రెడ్డి కూడా వీడియో విడుదల చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబానికి, తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఇలాంటి తప్పుడు ప్రచారం ద్వారా తమ ప్రతిష్టకు భంగం కలిగించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.