మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జులై 2022 (15:53 IST)

అన్నం, పప్పు, పచ్చడి కావాలని అడిగిన శ్రీముఖి

srimukhi
యాంకర్‌, నటి శ్రీముఖి అమెరికా టూర్‌కి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది.  ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇంటి దగ్గరి నుంచి బయలుదేరిన ఆమె ట్రావెల్‌ వ్లాగ్‌ చేస్తూ ప్రతి విషయాన్ని అందులో పంచుకుంది.
 
సెల్ఫ్‌ వీడియో తీసుకోవడం కష్టంగా ఉండటంతో గాయకుడు సాకేత్‌ ఆమెకు సాయం చేశారు. 'వీడియో రికార్డింగ్‌, ఫొటోలు తీయకపోతే ఊరుకోను' అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. 
 
ఇక ఆహారం తినేందుకు వెళ్లగా, అక్కడ అంతా నాన్‌-వెజిటేరియన్‌ ఉండటంతో తనకు అన్నం, పప్పు, పచ్చడి కావాలని అడిగింది. అనంతరం హైదరాబాద్‌-టు దుబాయ్‌ వెళ్లే విమానం ఎక్కారు.
 
ఆహారంగా ఏమేమి ఇచ్చారో అందులో చూపించారు. అనంతరం దుబాయ్‌లో దిగి, ఎమిరేట్స్‌ విమానం ఫస్ట్‌క్లాస్‌లో తొలిసారి ఎక్కినట్లు తెలిపారు. విమానంలో ఉన్న సౌకర్యాలను చెబుతూ షాకయ్యారు.