మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 30 జనవరి 2020 (17:50 IST)

కుప్పలు తెప్పలుగా కాయలు... చట్టిలో చికెన్, శ్రీరెడ్డి టేస్ట్ అదుర్స్-video

సినీనటులను, వారి పిల్లలను వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరి పేరు బయటపెడుతూ సంచలనంగా మారిన శ్రీరెడ్డి గురించి అందరికీ తెలుసు. కొన్నిరోజుల పాటు టివి షోలలో తెగ హడావిడి చేసిన శ్రీరెడ్డి ఆ తరువాత అవకాశాలు లేక ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటిల్లో తన బాధలను చెప్పుకుంటూ తిరిగారు. అయితే ఇప్పుడు ఆమె చేస్తున్న బిజినెస్ ఆమెకు బాగా కలిసి రావడంతో పాటు కావాల్సినంత డబ్బులను తెచ్చిపెడుతోందట.
శ్రీ రెడ్డి యూ ట్యూబ్ ఛానెల్. దాంతో లాభాలు కూడా భారీగానే వస్తున్నాయట. శ్రీ రెడ్డి ప్రస్తుతం యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకుని సింపుల్‌గా అందులో వంటలు చేసుకుంటుంది. మరో మాట లేకుండా చికెన్, మటన్ వండుకుంటూ తాను తింటూ.. పది మందికి తినిపిస్తుందట. ఈ వీడియోలు తన స్టైల్లో తీసి యూ ట్యూబ్‌‌లో పోస్ట్ చేస్తుంది శ్రీ రెడ్డి. అవి కాస్తా బాగానే వైరల్ అవుతున్నాయట.
 
ఒక్కో వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయట. హాట్ టిపిక్‌గా ఉండే శ్రీ రెడ్డి హాయిగా వంటలు చేసుకోవడం ఆమె అభిమానులకు పెద్దగా ఇష్టం లేకపోయినా కొంతమందికి మాత్రం ఆమె ఇలా ఉంటేనే బాగుంటుందంటూ సందేశాలను ట్విట్టర్, ఫేస్ బుక్, యుట్యూబ్ లింక్‌ల కింద టైప్ చేసి మెసేజ్‌లు చేస్తున్నారు.