సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (17:34 IST)

శ్రీరెడ్డి కొత్త బిజినెస్.. సిబ్బంది కావాలట!

కాస్టింగ్ కౌచ్‌తో ప్రారంభించి అర్ధనగ్న ప్రదర్శనల వరకు అన్నింటా సంచలనాలు మూటగట్టుకున్న శ్రీరెడ్డికి ఇప్పుడు కొత్తగా  సిబ్బంది కావలసి ఉందట. వివరాలలోకి వెళ్తే... కాస్టింగ్ కౌచ్‌తో ప్రారంభించి టాలీవుడ్‌లో అందరినీ ఒక రేంజ్‌లో ఆటాడేసుకుని... టాలీవుడ్ నుండి చెన్నైకి మకాం మార్చేసి తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో అప్పుడప్పుడూ మీడియా ముందు ప్రత్యక్షమయ్యే... శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూండడం తెలిసిందే. 
 
మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో అయితే... గంటకొక పోస్ట్ పెడ్తూ తన అభిమానులను ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖులపై సెటైర్లు వేసేస్తూ, విమర్శలు చేసేస్తూ ఉంటుంది. కాగా యూట్యూబ్‌లో శ్రీరెడ్డి పేరిట ఒక ఛానెల్‌ని కూడా నడిపించేస్తోన్న ఈవిడ వివిధ సంఘటనలపై తన అభిప్రాయాలను తెలిపే వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.
 
కాగా... సదరు శ్రీరెడ్డి ఇప్పుడు కొత్తగా మరో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించబోతోందట. కాగా ఇది తమిళంలో. నూతన సంవత్సరం సందర్భంగా నిధి ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరిట పెడ్తున్న ఈ ఛానెల్‌లో పని చేసేందుకు సిబ్బంది కావాలంటూ శ్రీరెడ్డి  ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. 
 
ఈ ఛానెల్‌లో పనిచేయడానికి యాక్టర్స్, యాంకర్స్ కావాలని పేర్కొన్న ఆవిడ... యాక్టర్స్, యాంకర్స్ పోస్టుల కోసం 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండే స్త్రీ, పురుషులిద్దరూ అప్లై చేయవచ్చుననీ, అలాగే.. కెమెరామేన్, ఎడిటర్, కంటెంట్ రైటర్‌లు వంటి వాళ్లు కూడా కావాలని ఇదే ప్రకటనలో పేర్కొంది. ఇంటర్న్‌షిప్ ఇవ్వడం ద్వారా యువతకు కూడా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన శ్రీరెడ్డి... ఆసక్తి ఉన్నవారు ప్రొఫైల్స్‌ను ఇమెయిల్ చేయాలని మెయిల్ ఐడీ కూడా ఇచ్చింది.
 
హైదరాబాద్ నుండి చెన్నైకి మకాం మార్చేసిన శ్రీరెడ్డి ఈ కొత్త సంవత్సరంలో కొత్త బిజినెస్‌ని ప్రారంభించేయబోతోంది మరి... ఇందులో ఏం మతలబు ఉందో ముందు ముందు చూద్దాం...