సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (15:25 IST)

'శ్రీరెడ్డి దొరికిపోయింది'..ఎక్కడ..? (video)

తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సంచలనానికి తెరతీసిన నటి శ్రీరెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌ను విడిచిపెట్టి చెన్నైలో ఉంటోంది. అయితే అప్పుడప్పుడు సంచలన ప్రకటనలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండానే మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె పేరును వాడుకుంటూ ఒక సినిమాను నిర్మిస్తున్నారు. 
 
'శ్రీరెడ్డి దొరికిపోయింది' అనే శీర్షికతో 'మానవ మృగాలకు' అనే ట్యాగ్‌లైన్‌ను కలిగిన ఒక సినిమా పోస్టర్ ఈరోజు రిలీజైంది. రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో ఆర్యన్, ఉపాసన జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. సినిమా టైటిల్ కాస్త వెరైటీగా ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
డి.వెంకటేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం యశ్వంత్ మూవీస్ పతాకంపై సప్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. గణేశ్ రాఘవేంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాకి శ్రీరెడ్డికీ ఎలాంటి సంబంధం లేనప్పటికీ టైటిల్‌లో శ్రీరెడ్డి అనే పేరుకు వాడడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది.