సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2019 (16:01 IST)

కాల్ మణి వ్యాపారుల ఆగడాలు తాళలేక...

కాల్ మణి వ్యాపారుల ఆగడాలు తాళలేక తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు ఉండవల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం
చేశాడు. 
 
పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మీడియా ముందు వాపోయాడు. పోలీసుల పట్టించుకోకుండా కాలయపన చేసి తనను దుర్భాషలాడారని ఆరోపణలు వస్తున్నాయి.
 
యువకుడికి 6లక్షలు వడ్డీకి ఇచ్చి 23 లక్షలు వడ్డీల రూపంలో కట్టించుకున్న వడ్డీ వ్యాపారి
తోలుత మూడు రూపాయలు వడ్డీ అని కాల్ మణి పేరుతో  నెలకు 12 రూపాయలు వసూళ్ళు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. 
 
పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు చేస్తున్నాడు అంటూ అవేధన చెందిన వెంకట్. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదంటూ అవేదన వ్యక్తం చేస్తున్న వెంకట్. 
 
తాడేపల్లి పోలీస్ స్టేషను సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించాడు.