గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (10:08 IST)

ప్రియుడికి పడక సుఖం ఇవ్వాలని కుమార్తెను పంపిన తల్లి

తన ప్రియుడుకు పడక సుఖం ఇవ్వాలని ఓ కన్నతల్లి కన్నబిడ్డను పడక గదిలోకి పంపించింది. దీన్నో లక్కీ ఛాన్స్‌గా భావించిన ఆ ప్రియుడు.. ఆ ముక్కుపచ్చలారని బిడ్డకు నరకం చూపించాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల అనే గ్రామానికి చెందిన మార్తమ్మ అనే మహిళ తన మైనర్ కుమార్తెను తన ప్రియుడు రాంబాబుకు పడక సుఖం ఇవ్వాలంటూ బలవంతం చేసి అతని వద్దకు పంపించింది. 
 
ఇక ఆ దుర్మార్గుడు ఆ చిన్నారికి రాత్రంతా నరకం చూపించాడు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తన నానమ్మకు చెప్పి బోరున విలపించింది. ఆ తర్వాత వారిద్దరూ వెళ్ళి జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. మార్తమ్మ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.