సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (16:00 IST)

అసెంబ్లీలో దిశకు ఆమోదం... మరుక్షణమే అమ్మాయిపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు కఠిన శిక్షలు విధించేలా దిశ పేరుతో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదముద్రవేసింది. అయితే, ఈ చట్టానికి ఆమోదం తెలిపి కొన్ని గంటలు కూడా గడవకముందే గుంటూరు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. 
 
గుంటూరులోని రామిరెడ్డి నగర్‌లో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై ఇంటర్ విద్యార్థి లక్ష్మణరెడ్డి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నగరపాలెం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లు తెలిసింది. బాధిత బాలికకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అసెంబ్లీలో ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టిన రోజే ఈ ఘటన జరగడంతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.