హైపర్ ఆది కుక్కబుద్ధి చూపించాడు.. ఆకులో ఈకగాడు.. శ్రీరెడ్డి ఫైర్
వివాదాస్పద నటి శ్రీరెడ్డి హైపర్ ఆదిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. హైపర్ ఆది పవన్ కల్యాణ్‌ను అభిమానిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రోజాతో వున్న పరిచయం వల్ల సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా జబర్దస్త్ కమెడియన్లను రోజా ఆహ్వానించారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ హాజరై పెద్ద ఎత్తున సందడి చేశారు. వీరిలో హైపర్ ఆది ఉండడం విశేషం. అయితే వేదికపై జగన్ గురించి అందరూ మాట్లాడారు. కానీ హైపర్ ఆది మాత్రం నోరెత్తలేదు. దీనిపై శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి వాడిని ఎందుకు ఆహ్వానించారని ఫైర్ అయ్యింది.
హైపర్ ఆదిని టార్గెట్ చేసింది. హైపర్ ఆది కుక్క బుద్ధి చూపించాడని.. డబ్బు ఇస్తే ఏ గడ్డి అయినా తింటావా? అని ప్రశ్నించింది. ఇంకా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రోజాగారు పిలిచారు... సరే ఇష్టం లేకపోతే రాకుండా వుండొచ్చు కదా.. డబ్బు కోసం ఏమైనా చేస్తావా.. ఆదికి మన పార్టీ పడదు..ఆకులో ఈకగాడు వాడు అలాంటి వాడు రాకపోతే జగనన్న బర్తడే ఆగిపోతుందా.. అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది. ఆదికి తల పొగరు ఎక్కువ సిగ్గులేని వెధవ అంటూ మండిపడింది.