గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 జులై 2022 (00:02 IST)

రోడ్డుపై శ్రీరెడ్డి.. వాహనాలను ఆపి ఫోన్ నెంబర్లను అడిగింది.. ఎందుకు? (video)

Sri Reddy
Sri Reddy
సోషల్ మీడియాలో శ్రీరెడ్డి యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఈ బ్యూటీ యూట్యూబ్ లో వీడియోలు చేస్తుండగా ఆ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫేస్‌బుక్‌లో శ్రీరెడ్డి 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
 
అయితే తాజాగా శ్రీరెడ్డి రొటీన్ కు భిన్నంగా తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తమిళ యూట్యూబ్ యాంకర్‌తో శ్రీరెడ్డి సరదాగా సంభాషించారు. యూట్యూబ్ యాంకర్ శ్రీరెడ్డికి ఒక ఛాలెంజ్ ఇవ్వగా ఆ ఛాలెంజ్‌ను శ్రీరెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. రోడ్డుపైన వాహనాలను ఆపి ఫోన్ నంబర్ తీసుకొని రావాలని యాంకర్ శ్రీరెడ్డికి ఛాలెంజ్ ఇచ్చారు తమిళ యాంకర్.
 
ఆ తర్వాత రోడ్డుపై వస్తున్న వాహనాలను ఆపుతూ శ్రీరెడ్డి ఫోన్ నంబర్లను అడిగింది. ఈ వీడియోకు 80,000 కంటే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. శ్రీరెడ్డి ఫోన్ నంబర్లు అడగగా కొంతమంది ఆమె అడిగిన వెంటనే ఫోన్ నంబర్లు ఇచ్చారు. మరి కొందరు మాత్రం ఆమె ఫోన్ నెంబర్ అడగటంతో  ఆమె షాకైంది.