శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 జులై 2022 (12:26 IST)

నిత్యానందాన్ని పెళ్ళాడాల‌నుంద‌న్న ప్రియా ఆనంద్‌!

Priya Anand, Nityananda
Priya Anand, Nityananda
న‌టి ప్రియా ఆనంద్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. అందుకు కార‌ణం త‌ను నిత్యానంద స్వామీని పెండ్లిచేసుకోవాల‌నుంద‌ని అన‌డ‌మే. తెలుగులో బ‌హు త‌క్కువ సినిమాలు చేసిన ఆమె త‌మిళంలో కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు వెబ్ సిరీస్‌కూడా చేసింది. తాజాగా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో పెండ్లి గురించి ప్ర‌స్తావిస్తూ పైవిధంగా స్సందించింది.పైగా దానికి వివ‌ర‌ణ కూడా ఇచ్చింది. ఎన్నో విమ‌ర్శ‌లకు గుర‌యినా ఆయ‌నంటే ఎంతోమంది ఇష్ట‌ప‌డ‌తారు. ఆరాధిస్తారు. అటువంటి నిత్య‌నంద‌తో జీవితంటే రోజూ నిత్యానంద‌మే అంటూ వ్యాఖ్యానించింది.
 
ఆమ‌ధ్య ఆయ‌న‌పై అత్యాచార కేసులుకూడా వున్నాయి. ఏకంగా ఓ హీరోయిన్ ఆయ‌న‌తో గ‌డిపిన స‌న్నివేశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత నిత్యానంద ఈక్వెడార్ అనే దేశంలోని ఓ దీవికి వెళ్ళి అక్క‌డ సెప‌రేట్ దేశంగా ప్ర‌క‌టించుకుని కొత్త క‌రెన్సీకూడా పెట్టుకున్నాడు. నిత్యానంద‌కు అప్ప‌ట్లో దేశంలోని ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కుల మ‌ద్ద‌తుకూడా వుండేది. మ‌రి ఇప్పుడు న‌టిగా పెద్ద‌గా అవ‌కాశాలు లేని ప్రియా ఆనంద్ స్టేట్‌మెంట్ ఆస‌క్తిగా మారింది. ఆయ‌న్ను పెండ్లి చేసుకుంటే ఇంటిపేరు కూడా మార్చుకోవాల్సిన ప‌నిలేదంటూ న‌వ్వేసింది. మ‌రి ఇది ప‌బ్లిసిటీ స్టంటా? ఏమిటో కొద్దిరోజుల‌కు కానీ తెలీదు.