విభజన హామీలు చాలా వరకు నెరవేర్చేశాం... ఇంకా మూడేళ్ళు టైముందిగా...
ఆంధ్రప్రదేశ్ ని అడ్డంగా విడగొట్టి, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ గా విడదీసిన సమయంలో కేంద్రం ఇచ్చిన విభజన హామీలపై ఆంధ్రా ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం కూల్ గా సమాధానం ఇచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నిధులు, నిర్దేశం లేక దీనావస్థలో ఉంటే, ఇప్పటికే దానిపై తాము చేయాల్సిందంతా చేసినట్లు పేర్కొంటున్నారు.
విభజన హామీలు చాలా వరకు నెరవేరాయని, మరికొన్ని హామీల అమలు పలు దశల్లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విభజన హామీల అమలుకు మూడేళ్ల సమయం ఉందని కేంద్ర హోంశాఖ రాజ్యసభలో తెలిపింది. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన హామీల అమలుపై కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తోందన్నారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ ఇప్పటి వరకు 25 సార్లు సమీక్షలు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.