మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (11:02 IST)

హైదరాబాదులో ఆ కారణంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న బైకర్లు..?

road accident
హైదరాబాదులో దిచక్ర వాహన చోదకుల కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు దాదాపు 58 శాతం మంది వున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది మే వరకు నమోదైన 363 ఘోర రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో దాదాపు 58 శాతం మంది ద్విచక్ర వాహన చోదకులు, పిలియన్- రైడర్లున్నారు. 
 
జనవరి మరియు మే మధ్య జరిగిన వివిధ ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణించిన 211 మందిలో, 172 మంది డ్రైవర్లు మరియు 39 మంది పిలియన్-రైడర్లు వున్నారు. బాధితుల్లో 191 మంది హెల్మెట్ లేకుండా ఉన్నారని అధికారులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో, హెల్మెట్‌లు ఉన్నవారు మరణించారు.
 
మరికొందరు హెల్మెట్ లేకుండా మరణించిన వారున్నారని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎంతగా హెచ్చరించినా వాహనదారులు హెల్మెట్ నిబంధనను పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన సీనియర్ పోలీసు అధికారులు ఇటీవలి కాలంలో జరిగిన ప్రమాదాల్లో కనీసం 58 శాతం మంది ద్విచక్ర వాహనదారులేనని, వారిలో ఎక్కువ మంది హెల్మెట్ ధరించలేదని సైబరాబాద్ డీసీపీ (ట్రాఫిక్) టి శ్రీనివాసరావు తెలిపారు. సరైన, ప్రామాణికమైన హెల్మెట్ వాడితే రోడ్డు ప్రమాదంలో రైడర్ చనిపోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు.
 
మోటారు సైకిల్‌పై ప్రయాణించేటప్పుడు లేదా పిలియన్ రైడింగ్ చేసేటప్పుడు మంచి నాణ్యమైన హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని వాహనదారులను కోరారు. పౌరులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని శ్రీనివాసరావు సూచించారు.