శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శనివారం, 3 నవంబరు 2018 (19:33 IST)

రజినీకాంత్ రోబో 2.0 పై రాజమౌళి ప్రశ్న... శంకర్ సమాధానం ఏంటి?

రోబో 2.0 ట్రెయిలర్ విడుదల సందర్భంగా కొందరు సెలబ్రిటీలు శంకర్‌ను కొన్ని ప్రశ్నలడిగారు. వాటికి శంకర్‌ సమాధానాలిచ్చారు. మరోవైపు ఆయన కూడా తన స్పీచ్‌ ఇచ్చారు. 
 
రాజమౌళి ప్రశ్న: ఇంత పెద్ద బడ్జెట్‌ సినిమాను తీస్తున్నప్పుడు ప్రెజర్‌ను ఎలా మేనేజ్‌ చేశారు? రోబో తర్వాత రజనీగారి ఫ్యాన్స్‌కి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎక్కువుంటాయి. వాటిని ఎలా మీట్‌ చేయబోతున్నారు?
 
శంకర్‌: నేను రాజమౌళిగారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన ఇండియన్‌ సినిమాకు చాలా గౌరవం తెచ్చిన వ్యక్తి. ప్రెజర్‌ని హ్యాండిల్‌ చేయడం అనేది ఇంకా ఎక్కువ పనిచేయడమే. సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్యాక్ట్‌ని ఎనలైజ్‌ చేస్తాను. అన్నీ కరెక్ట్‌‌గా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాను. ఎక్స్‌పెక్టేషన్‌ గురించి చెప్పేటప్పుడు '2.0'లో రజనీ సార్‌ని వసీగా, చిట్టిగా, 2.0గా, జెయింట్‌ చిట్టిగా చూస్తాం. ఇంకా కొన్ని సర్‌ప్రైజ్‌లున్నాయి. ఎక్స్‌పెక్టేషన్‌ని మీట్‌ అవుతుందని నేను నమ్ముతున్నా.
 
శివరాజ్‌ కుమార్‌: మీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? టైటిల్స్‌ అంత యాప్ట్‌‌గా ఎలా పెడుతున్నారు? మీకు కుదిరితే భవిష్యత్తులో మీతో ఒక సినిమా చేయాలని ఉంది. 
శంకర్‌: ఇలాంటి ఆలోచనలు గాలి నుంచి వస్తాయా? పైనుంచి వస్తాయా? అనేది నాకు తెలియదు. కానీ ఆడియన్స్‌కి ఏదో కొత్తగా చూపించాలని ఆలోచిస్తాను. ఆ ఆలోచనల నుంచే వస్తాయేమో. ఇక కథ గురించి ఆలోచించేటప్పుడే సరైన టైటిల్‌ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఎనలైజ్‌ చేసి పెట్టడమే. '2.0' విషయానికి వస్తే.. ఈ టైటిల్‌ గురించి మాట్లాడాలంటే.. మామూలుగా టెక్నికల్‌ లాంగ్వేజ్‌లో చెప్పేటప్పుడు వెర్షన్‌ సెకండ్‌ అని, ఇంకోటని అంటారు. 2.0 అని అంటే ఏ లాంగ్వేజ్‌ అయినా తప్పకుండా రీచ్‌ అవుతుందనిపించింది. అందుకే పెట్టాను. కన్నడ సూపర్‌స్టార్‌ అయి ఉండి ఆయన నాతో పనిచేయాలనుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నా. తప్పకుండా చేస్తాను. 
 
అభిమానుల ప్రశ్నలు! 
ఇన్ని ప్రెజర్స్‌ని దాటుకుని మిమ్మల్ని ఎక్కువ మోటివేట్‌ చేసిందేంటి? 
- ఆడియన్స్‌ నన్ను మోటివేట్‌ చేశారు. 
 
ఫిఫ్త్‌ ఫోర్స్‌ గురించి మాట్లాడారు. అలాగంటే ఏంటి? 
- మనకు నాలుగు ఫోర్స్‌ తెలుసు. ఐదో ఫోర్స్‌ అనేది నెగటివ్‌ ఎనర్జీ. దాన్ని ఎలా కొలవాలని అందరూ పరిశోధనలు చేస్తున్నారు. అదే ఫిఫ్త్‌ ఫోర్స్‌. 
 
3.0 వస్తుందా? 
- 3.0 కోసం చిన్న చిన్న ఐడియాస్‌ మైండ్‌లో ఉన్నాయి. కానీ ఈ సినిమా తర్వాత దాని కథ వర్కవుట్‌ అయితే చేస్తాను. 
 
కన్నడ నటుడు ఉపేంద్ర ప్రశ్న: నాలాంటి డైరక్టర్‌ కమ్‌ హీరోకి, శంకర్‌గారు, రజనీగారు ఏమైనా టిప్స్‌ ఇస్తారా? 
శంకర్‌: నేనేంటి ఆయనకు టిప్స్‌ ఇచ్చేది. ఆయన గొప్ప డైరక్టర్‌. ఆయన 'ఉపేంద్ర', 'ఎ' అనే సినిమాలు నాకు నచ్చిన సినిమాలు. ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటాయి. 'ఎ' సినిమా ఫస్ట్‌ సీనే క్లైమాక్స్‌లా ఉంటుంది. ఎవరికైనా వర్తించే సూత్రం ఒకటే. మీకు కన్వినియంట్‌ నిర్మాత, ప్రొడ్యూసర్‌, టెక్నీషియన్స్‌తో పనిచేయవద్దు. సరైన సబ్జెక్ట్‌ని ఎంపిక చేసుకుని, దానికి తగ్గ టెక్నీషియన్స్‌ని ఎంపిక చేసుకుని పనిచేస్తే అన్ని సినిమాలు విజయం సాధిస్తాయి. 
 
ఇక '2.0' సినిమా విషయానికి వస్తే... 'ఇలా జరిగితే ఎలా ఉంటుంది' అనే ఊహే ఈ కథ. ఇది పూర్తి స్థాయి యాక్షన్‌ థ్రిల్లింగ్‌ ఎంటర్టైన్‌మెంట్‌. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ, 4డీ అనే కొత్త అనుభవం ఉంటుంది. సుభాస్కరన్‌ లేకపోతే ఈ సినిమా లేదు. ఇండియన్‌ సినిమాను ఇంత బడ్జెట్‌ తో ఎవరూ నిర్మించరు. కేవలం సినిమా మీద ప్యాషన్‌తోనే ఆయన ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాకు చాలా గొప్ప బలం రజనీకాంత్‌గారు. ఆయన ఏం చేసినా, అట్రాక్టివ్‌గా, వ్యత్యాసంగా, స్టైల్‌గా, మాస్‌గా ఉంది. ఇన్నేళ్లుగా ఆయన నటించినప్పటికీ, ఇప్పటికీ ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంది. 
 
ఈ సినిమా ప్రారంభించినప్పుడు రజనీగార్‌కి కాస్త అనారోగ్యంగా ఉంది. ఢిల్లీలో యాక్షన్‌ డైరక్టర్లు, వీఎఫ్‌ ఎక్స్‌ డైరక్టర్లు, అక్షయ్‌ కుమార్‌, చాలా మంది కార్పెంటర్లు, జూనియర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపు ఆరు నెలల ముందే ప్లాన్‌ చేసుకున్న షెడ్యూల్‌ అది. దాదాపు 500-1000 మంది అక్కడ ఉన్నారు. ఆ సమయంలో రజనీకి అనారోగ్యంగా ఉన్నప్పటికీ 47 డిగ్రీల ఎండ, 12 కిలోల బరువు వేసుకుని క్లైమాక్స్‌ చేశారు. ఒక రోజైతే ఆయనకు దెబ్బ తగిలింది కూడా నాకు తెలియదు. ఎవరో వచ్చి చెప్పారు. ఆయన్ని కూర్చోపెట్టి.. ప్యాంట్‌ కాస్త పైకి తీసి చూస్తే రెండు ఇంచ్‌లు తెగిన విషయం తెలిసింది. ఆయన్ని బతిమలాడి హాస్పిటల్‌కి పంపాం. ఇలాంటి డెడికేషన్‌ వల్లనే ఆయన సూపర్‌స్టార్‌ అయ్యారు. 
 
అక్షయ్‌గారు ఈ సినిమాకు పడ్డంత ఎప్పుడూ కష్టపడి ఉండరు. థిక్‌ డ్రస్‌, విగ్‌, కళ్లకు లెన్స్‌, ప్రోస్తటిక్‌ మేకప్‌.. అంత కష్టపడి చేశారు. ఆరు నెలలకు ముందు నుంచే రెహ్మాన్‌గారు మరలా మరలా మ్యూజిక్‌ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అంతా పాటల్లాగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం నాతోపాటు కుక్కల్లాగా, దెయ్యాల్లాగా కష్టపడింది మా అసోసియేట్‌ డైరక్టర్‌ పప్పు. తన కష్టం చాలా గొప్పది. శరత్‌, ప్రశాంత్‌, నీలేష్‌, కార్తిక్‌, గోవర్ధన్‌.. వీళ్లందరూ నాతో పాటు నాలుగేళ్లు కష్టపడ్డారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ ముత్తురాజ్‌గారు ప్రీ ప్రొడక్షన్‌లో చాలా ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టారు. సినిమా షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, మరీ ముఖ్యంగా వీఎఫ్‌ ఎక్స్‌‌లో ఆయన భాగం ఎక్కువ. 
 
వీఎఫ్‌ఎక్స్‌ శ్రీనివాసన్‌ కథ నుంచి ఫస్ట్‌ కాపీ వరకు కాన్‌స్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆంటోనీ, యానిమేషన్‌ని, తర్వాత షూట్‌ని, ఇప్పుడు సీజీని... మొత్తం మూడు రకాలుగా ఎడిట్‌ చేశారు. నీరవ్‌ షా, జయమోహన్‌, ఎమీ, కరుణా మూర్తి... ఇలా ప్రతి ఒక్కరూ ఎంతెంతో కష్టపడ్డారు. అసాధారణమైన కృషి చేశారు. మీడియాకు నా విన్నపం... ఇలాంటి సినిమాలను సపోర్ట్‌ చేయండి. వేలమంది టన్నుల కొద్దీ కష్టపడ్డారు. మీడియా సపోర్ట్‌ చేస్తే, మన ఊరిలోనూ ఇలాంటి సినిమాలను చేయగలం అని ప్రపంచానికి చెప్పగలం. ఇలా చాలా సినిమాలు వస్తాయి'' అని అన్నారు.
 
4డీ గురించి దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కథను రాసేటప్పుడు ఎలాగైనా ఇది త్రీడీలో వస్తేనే బావుంటుందని అనుకున్నా. సౌండ్‌ మాత్రం 4 డీలో ఉండాలని అనుకున్నా. నా ఎన్నో ఏళ్ల కల అది. మామూలుగా మనం సినిమా చూసేటప్పుడు చుట్టుపక్కల నుంచి, పై నుంచి స్పీకర్ల ద్వారా శబ్దాలను వినొచ్చు. కానీ కాళ్ల కింద కూడా స్పీకర్లు ఉంటే... నేల మీద జరిగే అంశాలకు కూడా సౌండ్‌ కల్పిస్తే బావుంటుందని ఆశించాను. రసూల్‌ పూకుట్టి కూడా దానికి ఎంతగానో సహకరించారు. కేవలం 4డీ సౌండ్‌‌ని అందించడం మాత్రమే కాదు.. 4,5 స్టూడియోలో ఉన్న అన్నీ సిస్టమ్స్‌‌ని ఆయన స్టూడియోకి తెచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత మేం పడ్డ కష్టం అర్థమవుతుంది. ఎగ్జిబిటర్లకు నేను రిక్వస్ట్‌ చేసేది ఒక్కటే.. దయచేసి త్రీడీ థియేటర్లను ఎక్కువ చేయండి. ఈ సినిమా ఫుల్‌ ఎఫెక్ట్‌ తెలియాలంటే 4డీ సౌండ్‌ సిస్టమ్‌లోనూ, త్రీడీలోనూ చూస్తేనే అందుతుంది'' అని అన్నారు.