సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (17:04 IST)

''2.ఓ'' ట్రైలర్ రిలీజ్‌కు వేళాయే...

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఓ శుభవార్త. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న.. ''2.ఓ'' సినిమా ట్రైలర్ దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం రజనీ ఫ్యాన్స్ వేయి కనులతో ఎదురుచూస్తున్న వేళ.. ఈ సినిమా ట్రైలర్‌కు ముహూర్తం ఖరారైంది. 
 
అంతేకాకుండా.. సినిమాను కూడా నవంబరులోనే విడుదల చేయాలని సినీ యూనిట్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా.. ఈ సినిమాను నవంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. నవంబర్ 3న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. 
 
ఈ ట్రైలర్‌పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసేలా ఈ ట్రైలర్ వుంటుందని టాక్. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా ఎమీ జాక్సన్ నటిస్తోంది.