సుధీర్‌బాబు ఆవిష్కరించిన`స్వ`లోని `నింగిన జారిన జాబిలి`వీడియో సాంగ్.
జీఎమ్ఎస్ గ్యాలరీ ఫిలిం పతాకంపై మను పీవి దర్శకత్వంలో జీఎమ్ సురేష్ నిర్మిస్తున్న చిత్రం `స్వ`. మహేష్ యడ్లపల్లి, స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మాణిక్ రెడ్డి లు ముఖ్య తారాగణంగా నటించారు. ఇప్పటికే విడుదలైన `స్వ` ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజు ఈ చిత్రంలోని `నింగిన జారిన జాబిలి` అనే గీతాన్ని హీరో సుధీర్‌బాబు రిలీజ్ చేశారు.
ఓ మైన వినవే హామీనే ఇస్తున్నానే.. కడవరకు నీతో నీ వాణ్ణై ఉంటానే..అంటూ సాగే ఈ గీతాన్ని కార్తిక్, నాదప్రియ ఆలపించగా సంగీత దర్శకుడు కరణం శ్రీ రాఘవేంద్ర స్వరపరిచారు. నాగరాజు కువ్వారపు సాహిత్యాన్ని అందించారు. ప్రస్తుతం ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
తారాగణం:
మహేష్ యడ్లపల్లి, స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మాణిక్ రెడ్డి
సాంకేతిక వర్గం:
బ్యానర్: జీఎమ్ఎస్ గ్యాలరీ ఫిలిం
దర్శకత్వం: మను పీవి
నిర్మాత: జీఎమ్ సురేష్
సంగీతం: శ్రీ రాఘవేంద్ర
ఛాయాగ్రహణం: దేవేంద్ర సురి పరవస్తు,
ఎడిటింగ్: శ్రీ వర్కల