ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (15:46 IST)

రాజమౌళి కోసం సెపరేట్ కుర్చీ వేసిన సుకుమార్

Sukumar team and chair
Sukumar team and chair
నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయిన సందర్భంగా దర్శకుడు సుకుమార్ సరికొత్తగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. తన సాంకేతిక సిబ్బందితో సిట్టింగ్ వేసి ఉన్న ఫోటో పోస్ట్ చేసి ఇలా తెలిపారు.  నా టీమ్ మీటింగ్‌లు, డిస్కషన్స్ అన్నీ ఇన్నాళ్లూ ప్రిన్సిపల్ కుర్చీని అసంకల్పితంగా ఖాళీగా వదిలేశాను. . కానీ, ఇప్పుడు నేను అలా ఎందుకు చేశానో అర్థం చేసుకున్నాను, SS రాజమౌళి సార్ ఇది మీకోసమే... కుర్చీ ఎప్పుడూ మీకు చెందినది మరియు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది.
 
రాజమౌళి గారు, ఎంఎం కీరవాణి గారు,  చంద్రబోస్ గారు,  ప్రేమ్రక్షిత్ గారు, రాహుల్ సిప్లిగంజ్,  కాలభైరవ & RRR మూవీ టీమ్‌కి అభినందనలు అని తెలిపారు. సుకుమార్ యాక్షన్ సీన్స్ చేసే టప్పుడు రాజమౌళి ని సెట్ కు ఆహ్వానం పలికేవారు. అల్లు అర్జున్ పుష్ప సెట్ లోనూ ఓసారి రాజమౌళి వెళ్లి సూచనలు చేసారు. ఇక ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ కూ రాజమౌళి ని పిలవనున్నారు.