శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (09:25 IST)

"ఆర్ఆర్ఆర్" చిత్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు

rrrmovie
రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రం ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులను గెలుచుకుంది. తాజాగా మరో అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా 46వ జపాన్ అకాడెమీ ఫిల్మ్ ప్రైజ్‌కు సంబంధించి "ఔట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్" విభాగంలో అవార్డును దక్కించుకుంది. 
 
"అవతార్", "టాప్‌గన్ : మ్యావరిక్" వంటి ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి "ఆర్ఆర్ఆర్" ఈ జపాన్ పురస్కారాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. దీంతో చిత్రబృందంతో పాటు అభిమానులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే, ఈ చిత్రం ఇప్పటికే ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెల్సిందే. 
 
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు పాట నామినేషన్స్‌కు షార్ట్ లిట్ అయింది. అలాగే, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లోనూ ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతుంది. మరికొన్ని గంటల్లో ఈ నామినేషన్స్ తుది జాబితా వెల్లడికానుంది.